శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భీమేశ్వరాలయంలో 13 రోజుల పాటు సేకరించిన హుండీ ఆదాయాన్ని తాజాగా లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం ₹1,72,76,469 (రూ. ఒక కోటి డెబ్బై రెండు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది) రూపాయల నగదు ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా హుండీ లెక్కింపులో 75 గ్రాములు 300 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏసీ కార్యాలయ పరిశీలకులు శ్రీ రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లను ఎస్పీఎఫ్, హోమ్ గార్డ్ సిబ్బంది పర్యవేక్షించగా, ఆలయ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు హుండీ వెంపకంలో సహకరించారు. భక్తుల విశ్వాసానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.
