Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News“ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై వెంటనే చర్యలు తీసుకోండి.. RTOకు… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 13 Jun 2026, 3:01 pm  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 30 💬 0
Telangana > Latest News > Wanaparthy

“ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై వెంటనే చర్యలు తీసుకోండి.. RTOకు ABVP వినతి!”

“ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై వెంటనే చర్యలు తీసుకోండి.. RTOకు ABVP వినతి!”

వనపర్తి జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలకు చెందిన ఫిట్నెస్ లేని బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) డిమాండ్ చేసింది. ఈ మేరకు వనపర్తి జిల్లా RTO సురేష్‌కు ABVP జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. కొత్త విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో నడుస్తున్న స్కూల్ బస్సుల ఫిట్నెస్, లైసెన్స్, పర్మిట్లు మరియు భద్రతా ప్రమాణాలను సమగ్రంగా తనిఖీ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ABVP జిల్లా కన్వీనర్ దేవర్ల కార్తీక్ మాట్లాడుతూ, అనేక ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సులను నడుపుతున్నాయని ఆరోపించారు. బస్సులు నడిపే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి, కంటి చూపు, డ్రైవింగ్ అర్హతలను కూడా పరిశీలించాలని సూచించారు. అలాగే బస్సుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు

ఫిట్నెస్ లేని బస్సుల కారణంగా విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని ABVP నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి బంటీ, అల్లాడి కార్తీక్, పవన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.