Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International NewsAPSRTC ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్: ₹75 కోట్లు విడుదల… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 17 Apr 2026, 9:37 am  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 22 💬 0
Andhra Pradesh > Latest News

APSRTC ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్: ₹75 కోట్లు విడుదల – SRBS నిధులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

APSRTC ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్: ₹75 కోట్లు విడుదల – SRBS నిధులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APSRTC ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న SRBS (Self Retirement Benefit Scheme) నిధుల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఈ నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా సుమారు 8,450 మంది APSRTC ఉద్యోగులకు రూ.75 కోట్లు విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి

గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం, వైసీపీ ప్రభుత్వం SRBS పథకాన్ని రద్దు చేయడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వారు తమ పొదుపు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది

ఈ చర్యతో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలగనుంది. రిటైర్మెంట్ తర్వాత జీవనోపాధి కోసం ఆధారపడే ఈ నిధులు, ఉద్యోగుల భవిష్యత్తుకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియజేశాయి