Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International NewsTTDలో అధికారిక విధుల బదిలీ కార్యక్రమం › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 04 Feb 2026, 10:30 am  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 21 💬 0
Latest News > Andhra Pradesh > Visakhapatnam

TTDలో అధికారిక విధుల బదిలీ కార్యక్రమం

TTDలో అధికారిక విధుల బదిలీ కార్యక్రమం

జీవో నెం.191 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వెళ్తున్న శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆదివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అధికారికంగా విధుల బాధ్యతలు అప్పగించారు. అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి గారికి పరిపాలనా బాధ్యతలను అప్పగిస్తూ అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు దంపతులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. TTD తరఫున శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల సేవలో భాగంగా ఆయన చేసిన సేవలను పలువురు ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో ఇది ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు