Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International Newsనిజాయితీకి బహుమానమా? 40 రోజుల్లోనే ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 28 Jan 2026, 9:44 pm  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 20 💬 0
Andhra Pradesh > Latest News > YSR Kadapa

నిజాయితీకి బహుమానమా? 40 రోజుల్లోనే ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై ప్రజల్లో చర్చ

నిజాయితీకి బహుమానమా? 40 రోజుల్లోనే ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై ప్రజల్లో చర్చ

ప్రొద్దుటూరు పట్టణంలో 1 టౌన్ సీఐగా పనిచేసిన శ్రీరామ్ కేవలం 40 రోజులకే బదిలీ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. గత ఏడాది డిసెంబర్ 18న ఆయన ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలోనే పట్టణంలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను బలోపేతం చేశారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండే నిజాయితీ అధికారిగా గుర్తింపు పొందారు.

ఇలాంటి సమయంలో ఆయనను బదిలీ చేయడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. శ్రీరామ్ స్థానంలో అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న టీవీ కొండారెడ్డిని ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐగా నియమించారు. ఈ బదిలీ నిర్ణయంపై పట్టణ వాసులు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఇది సరైన న్యాయమా? అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం ప్రొద్దుటూరులో ప్రధాన చర్చాంశంగా మారింది.