Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International Newsఎమ్మిగనూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 15 Aug 2026, 4:01 pm  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 13 💬 0
Andhra Pradesh > Kurnool > Latest News

ఎమ్మిగనూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చల్లా శ్రీ వరుణ్

ఎమ్మిగనూరులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చల్లా శ్రీ వరుణ్

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మిగనూరులో జనసేన నాయకులు శ్రీ చల్లా శ్రీ వరుణ్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా శ్రీ వరుణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య వేడుకలను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన రోజని అన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఎప్పటికీ మరచిపోకూడదని, వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలని చల్లా శ్రీ వరుణ్ సూచించారు. భారతదేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, నాయకులు, జనసేన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.జై హింద్! 🇮🇳వందే మాతరం! 🇮🇳