Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News**ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎప్పుడు..? అత్యవసర వైద్యం లేక… › e-Paper Clip Global Times Telugu – Telugu News | Andhra Pradesh | Telangana | National & International News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 12 Aug 2026, 5:58 pm  |  Posted by : CHIEF EDITOR HAREESH BABU
👁 99 💬 0
Andhra Pradesh > Kurnool > Latest News

**ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎప్పుడు..? అత్యవసర వైద్యం లేక పేద రోగుల అవస్థలు.. ప్రజాప్రతినిధులు స్పందించాలంటున్న ప్రజలు**

**ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎప్పుడు..? అత్యవసర వైద్యం లేక పేద రోగుల అవస్థలు.. ప్రజాప్రతినిధులు స్పందించాలంటున్న ప్రజలు**

ఆదోని నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవలపై స్థానిక ప్రజలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది పేద ప్రజలు ఆధారపడే ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్య సదుపాయాల కొరత కారణంగా తీవ్ర అనారోగ్యంతో వచ్చే రోగులను మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మెరుగైన అత్యవసర చికిత్సా విభాగాలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆదోని నుంచి కర్నూలుకు రోగులను తరలించాల్సి రావడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో సమయం కీలకంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

స్వయంగా వైద్య నేపథ్యం కలిగిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి.వి. పార్థసారధి ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. CT స్కాన్, ICU పరికరాలు, అవసరమైన నిపుణుల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఆసుపత్రి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.