నేడు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సుధాకర్ గారిని కలిసి జిల్లాలోని ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్న అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాము. విద్య హక్కుగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన సమయంలో కొన్ని విద్యాసంస్థలు నియంత్రణ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాము.
అలాగే ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే కొన్ని విద్యాసంస్థలు నిర్వహణ కొనసాగిస్తున్నాయని, అలాంటి సంస్థలను గుర్తించి సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విద్యాసంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశాము.
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని డీఈఓ గారిని కోరడం జరిగింది. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు.– రాయలసీమ రవికుమార్రాష్ట్ర అధ్యక్షులురాయలసీమ విద్యార్థి పోరాట సమితి