అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి ఇరాన్‌పై కఠిన వైఖరి వ్యక్తం చేశారు. వచ్చే 24 గంటల్లో భీకర దాడులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ఉధృతం చేయలేదని, కానీ అవసరమైతే తీవ్ర చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ యుద్ధాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తే, అమెరికా మరింత శక్తివంతమైన ప్రతిస్పందన ఇస్తుందని పేర్కొన్నారు.
ఇరాన్లో ఉన్న ముప్పులను పూర్తిగా తొలగిస్తామని, ఈ చర్యలు చాలా శక్తిమంతంగా ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా చమురు ధరలు, ఈ పరిణామాలపై ప్రభావితమవుతున్నాయి. ప్రపంచ దేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా తదుపరి చర్యలు ఏమిటన్నది గ్లోబల్ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.
